సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి

ABN , First Publish Date - 2020-12-26T05:45:36+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టరు డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా ఆదేశించారు

సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి
ముఖ్యమంత్రి సభాస్థలి వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టరు భరత్‌ గుప్తా

శ్రీకాళహస్తి, డిసెంబరు 25: ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టరు డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా ఆదేశించారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఈ నెల 28న ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టరు ఊరందూరు సమీపంలోని సభాస్థలంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరాలయ పరిపాలన భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి, పంగూరు నుంచి సభాస్థలికి వచ్చే రోడ్లుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని ఆదేశించారు. సభాస్థలి వద్ద పైలాన్‌ ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. ఆ తరువాత ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారన్నారు. లబ్ధిదారులకు ఇచ్చే ప్లాట్‌ నంబర్లు తెలిసేలా మ్యాపింగ్‌ చేయాలన్నారు. ముఖ్యమంత్రి సభ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్లు మార్కండేయులు, వీరబ్రహ్మం, రాజశేఖర్‌, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ అమరనాథరెడ్డి, డ్వామా పీడీ చంద్రశేఖర్‌, డీఆర్‌డీఏ పీడీ తులసి, తహసీల్దారు జరీనాబేగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-26T05:45:36+05:30 IST