ప్రశ్నిస్తే చంపేస్తారా?
ABN , First Publish Date - 2020-12-30T05:40:49+05:30 IST
ప్రశ్నిస్తే హత్య చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే అంతమొందిస్తారా అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
పలమనేరు, డిసెంబరు29 : ప్రశ్నిస్తే హత్య చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే అంతమొందిస్తారా అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యను ఆయన మంగళవారం తీవ్రంగా ఖండించారు. సుబ్బయ్య హత్య బాధాకరమని, సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంతజిల్లాలోనే ఈ ఘటన జరగడం దారుణమన్నారు. బడుగు, బలహీన, తెలుగుదేశం వారిని హత్యచేయడమే వైసీపీ అజెండానా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగిన హత్యలపై పోలీసులు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. దోషులను చట్టపరంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.