-
-
Home » Andhra Pradesh » Chittoor » APRJC entrance exam on May 14
-
మే 14న ఏపీఆర్‌జేసీ ప్రవేశ ప్రవేశపరీక్ష
ABN , First Publish Date - 2020-03-24T10:45:38+05:30 IST
ఏపీ రెసిడెన్సియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి మే 14న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గ్యారంపల్లె గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌వి. శివయ్య తెలిపారు.

కేవీపల్లె, మార్చి 23: ఏపీ రెసిడెన్సియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి మే 14న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గ్యారంపల్లె గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌వి. శివయ్య తెలిపారు. ఇంటర్‌లో ప్రవేశానికి 2019-20 విద్యాసంవత్సరంలో 10వ త రగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 23 నుంచి ఏప్రిల్ 22లోపు ఆన్‌లైన్‌లో రూ.250 ప్రవేశ రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రవేశం లభించే కళాశాలల వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ (బాలురు) : గ్యారంపల్లె (చిత్తూరు), కొడిగెనహళ్లి (అనంతపురం), నాగార్జున సాగర్ (గుంటూరు) , బాలికలు : బనవాసి ( కర్నూలు), నిమ్మకూరు (కృష్ణా, కో ఎడ్యుకేషన్)
డిగ్రీ(బాలురు, రాయలసీమ)
సాగర్ (గుంటూరు), సిల్వర్ జూబ్లీ కళాశాల ( కర్నూలు), బాలికలు : సిల్వర్ జూబ్లీ కళాశాల (కర్నూలు)