పదనోన్నతుల్లో రిజర్వేషన్ల వల్ల ఓసీ ఉద్యోగులకు అన్యాయం

ABN , First Publish Date - 2020-10-19T10:34:31+05:30 IST

పదనోన్నతుల్లో రిజర్వేషన్ల వల్ల ఓసీ ఉద్యోగులకు అన్యాయం

పదనోన్నతుల్లో రిజర్వేషన్ల వల్ల ఓసీ ఉద్యోగులకు అన్యాయం

కలికిరి, అక్టోబరు 18: సీనియారిటీ ప్రకారం ఉద్యోగాల్లో వున్న వారికి పదోన్నతులు కల్పించాలని ఎస్పీడీసీఎల్‌ ఓసీ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. కలికిరిలో ఆదివారం జరిగిన తిరుపతి సర్కిల్‌ ఓసీ ఉద్యోగుల సంఘ సమావేశంలో పలువురు విద్యుత్‌ శాఖ ఉద్యోగుల నాయకులు మాట్లాడుతూ ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు పాటించడం కారణంగా సీనియర్‌ ఉద్యోగులు వెనుకబడిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. ఈ విషయాన్ని మేనేజిమెంటు దృష్టికి తీసుకెళ్ళాలని సమావేశం అభిప్రాయపడింది. రిజర్వేషన్ల కారణంగా సీనియర్లు అక్కడే వుండగా జూనియర్లు మాత్రం పై పోస్టులకు వెళుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీడీసీఎల్‌ అధ్యక్షుడు సతీష్‌, ప్రధాన కార్యదర్శి రంగారావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వాసుదేవ రెడ్డి, తిరుపతి సర్కిల్‌ కార్యదర్శి చంద్రమౌళి రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేందర్‌ రెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు వాసుదేవనాయుడు, కార్యదర్శి ప్రకాష్‌ రెడ్డి, కోశాధికారి శ్రీనివాసులునాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 11 మండలాలకు చెందిన విద్యుత్‌ శాఖ ఓసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T10:34:31+05:30 IST