అమ్మవారి సేవలో ప్రధాన న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2020-12-27T06:23:02+05:30 IST

వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ శనివారం దర్శించుకున్నారు.

అమ్మవారి సేవలో ప్రధాన న్యాయమూర్తులు
ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి

తిరుచానూరు, డిసెంబరు 26: వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. జేఈవో బసంతకుమార్‌, డిప్యూటీఈవో ఝాన్సీరాణి, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబాస్వామి, సూపరింటెండెంట్లు మల్లీశ్వరి, మధు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-27T06:23:02+05:30 IST