‘విగ్రహాల’ లింకు దొరికింది!

ABN , First Publish Date - 2020-09-21T11:54:25+05:30 IST

‘విగ్రహాల’ లింకు దొరికింది!

‘విగ్రహాల’ లింకు దొరికింది!

శ్రీకాళహస్తి, సెప్టెంబరు 20: శ్రీకాళహస్తీశ్వరాలయంలో అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేసిన లింకు దొరికినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిందితుల జాడ తెలుసుకోవడానికి పోలీసులు కేరళ వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 6న ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలు ప్రతిష్ఠించగా.. 11న వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆలయంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విగ్రహాలు ఏర్పాటు చేయడానికి నిందితులు ద్విచక్ర వాహనాల ద్వారా వచ్చినట్లు వీరి పరిశీలనలో తెలిసింది. అందులో ఒక వావానం ఆచూకీ పోలీసులు కనుగొన్నట్లు సమాచారం. దీని ద్వారా కూపీలాగగా కేరళకు చెందిన వ్యక్తి నుంచి తమిళనాడుకు చెందిన వ్యక్తి కొన్నట్లు తేలింది. ఆ తరువాత ఎవరు... ఎవరికి విక్రయించారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ద్విచక్ర వాహనాన్ని తొలుత విక్రయించిన కేరళకు చెందిన వ్యక్తి ద్వారా సమాచారం సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. 


Updated Date - 2020-09-21T11:54:25+05:30 IST