ద్విచక్ర వాహనం బోల్తా - ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-09-21T11:52:28+05:30 IST

ద్విచక్ర వాహనం బోల్తా - ఒకరి మృతి

ద్విచక్ర వాహనం బోల్తా - ఒకరి మృతి

శాంతిపురం, సెప్టెంబరు 20: కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తాపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రాళ్లబూదుగూరు ఎస్‌ఐ మురళీమోహన్‌ కథనం మేరకు.. కుప్పం మండలం కంగుది గ్రామానికి చెందిన జయప్ప(50) ద్విచక్ర వాహనంలో వి.కోటకు వెళ్లాడు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలోని బడుగుమాకులపల్లె వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-09-21T11:52:28+05:30 IST