ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

ABN , First Publish Date - 2020-09-21T11:52:17+05:30 IST

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

పలమనేరు రూరల్‌, సెప్టెంబరు 20 : పలమనేరు - దండపల్లె రహదారిలో ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. గంగవరం మండలం పత్తికొండకు చెందిన కృష్ణమ్మ (51) ఆదివారం పలమనేరు సమీపంలోని సాయినగర్‌ ప్రాంతంలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వచ్చింది. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి అల్లుడు సతీష్‌తో కలసి ద్విచక్రవాహనంపై డండపల్లె రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొంది. వెనుక ఉన్న కృష్ణమ్మకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T11:52:17+05:30 IST