మరో 366 కేసులు

ABN , First Publish Date - 2020-07-28T10:38:52+05:30 IST

జిల్లాలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచీ సోమవారం రాత్రి 7 గంటల నడుమ మరో 366 మందికి కరోనా సోకినట్టు ..

మరో 366 కేసులు

మొత్తం కరోనా పాజిటివ్‌లు 8680


తిరుపతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం రాత్రి 9 గంటల నుంచీ సోమవారం రాత్రి 7 గంటల నడుమ మరో 366 మందికి కరోనా సోకినట్టు జిల్లా యంత్రాంగం నిర్ధారించింది. వీటిలో సోమవారం ఉదయం 9 గంటల నుంచీ రాత్రి 7 గంటల్లోపు అంటే 12 గంటల స్వల్ప వ్యవధిలో నమోదైన కేసులు 338 వుండడం గమనార్హం. కాగా సోమవారం నమోదైన కేసుల్లో తిరుపతి నగరానికి చెందినవి 183 వుండగా శ్రీకాళహస్తివి 34, తిరుపతి రూరల్‌వి 18, పుత్తూరువి 15, చంద్రగిరికి చెందినవి 14, నగరి కేసులు 11 చొప్పున వున్నాయి.


అలాగే మదనపల్లెలో 7, చిత్తూరు, పీలేరుల్లో 6 చొప్పున, వరదయ్యపాలెంలో 5, కలికిరి, పలమనేరుల్లో 3 చొప్పున, బీఎన్‌ కండ్రిగ, రేణిగుంట, సత్యవేడు, వడమాలపేట మండలాల్లో 2 చొప్పున, బి.కొత్తకోట, చిన్నగొట్టిగల్లు, గుడిపాల, గుర్రంకొండ, నాగలాపురం, నారాయణవనం, పెద్దపంజాణి, పులిచెర్ల, పుంగనూరు, రామచంద్రాపురం, సదుం, తంబళ్ళపల్లె, తొట్టంబేడు, విజయపురం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8680కి చేరుకుంది.


కొవిడ్‌ ఆస్పత్రుల నుంచి 120 మంది డిశ్చార్జి

తిరుపతి (వైద్యం), జూలై 27: కరోనాతో చికిత్స పొందుతూ కోలుకున్న 120 మందిని వైద్యులు సోమవారం డిశ్చార్జి చేశారు. వీరిలో టీటీడీ శ్రీనివాసం కొవిడ్‌ సెంటర్‌లో 87 మంది, రుయా కొవిడ్‌ ఆస్పత్రిలో 8 మంది ఉన్నారు. వీరికి రుయా ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగమునీంద్రుడు, ఆర్‌ఎంవో డాక్టర్‌ ఈబీ దేవి, డాక్టర్‌ హరికృష్ణ, కొవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ సుబ్బారావు, శ్రీనివాసం కొవిడ్‌ సెంటర్‌ వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాసరావు చేతుల మీదుగా వీరికి రూ.2వేల  ప్రభుత్వ సాయం అందించారు. శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రిలో జిల్లాకు చెందిన 17 మంది, కడప జిల్లావాసులు ఆరుగురు, నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు చొప్పున 25 మందిని డిశ్చార్జి చేసినట్లు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రిలో 356 మంది చికిత్స పొందుతున్నారన్నారు. 


 కోవిడ్‌ కేర్‌ ఆస్పత్రిగా మదనపల్లె ఏఎంసీ?

కలికిరి, జూలై 27: మదనపల్లె సమీపంలోని ఆరోగ్యవరం మెడికల్‌ సెంటర్‌ (ఏఎంసీ)ని కోవిడ్‌ కేర్‌ ఆస్పత్రిగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శానిటోరియం ఆస్పత్రిగా ప్రఖ్యాతిగాంచిన ఏఎంసీని ప్రత్యేకించి క్షయ వ్యాధి నివారణ కోసం దశాబ్దాల క్రితం ఆరోగ్యవరంలో ఏర్పాటు చేశారు.సోమవారం జిల్లా కొవిడ్‌ టీమ్‌ ఈ ఆస్పత్రిని పరిశీలించి వసతుల గురించి అధ్యయనం చేసింది.వార్డులు, పరుపులు, మంచాలు, వాష్‌ రూంలు, వైద్యులు, సిబ్బంది, నీటి సరఫరా, విద్యుత్‌ సౌకర్యం, వెంటిలేటర్లు, ల్యాబ్‌లు, అంబులెన్సులు, బయోమెడికల్‌ వ్యర్థాలకు అవకాశాలు, ఆక్సిజన్‌ జనరేటర్లు, రవాణా సౌకర్యాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలనలు చేపట్టింది.ఈ విషయంపై డిప్యూటీ డీఎంహెచ్‌ఓ లోకవర్ధన్‌ను వివరాలు కోరగా కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ప్రస్తుతం ఏఎంసీలో 50 పడకలు పూర్తి స్థాయిలో అందుబాటులో వున్నాయని, మరో 200 పడకల వరకూ విస్తరించుకోవచ్చని చెప్పారు.   

Updated Date - 2020-07-28T10:38:52+05:30 IST