600 దాటేశాయ్‌!

ABN , First Publish Date - 2020-06-19T11:14:15+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి జిల్లాలో జెట్‌ వేగంతో దూసుకెళుతోంది. కొద్ది రోజులుగా ఏరోజూ 20కి తక్కువ కాకుండా పాజిటివ్‌ కేసులు

600 దాటేశాయ్‌!

జెట్‌ స్పీడుతో వ్యాపిస్తున్న కరోనా

కొత్తగా మరో 23 పాజిటివ్‌ కేసులు

తిరుపతి రూరల్‌ 13... అర్బన్‌ 3

54కు పెరిగిన బాధిత మండలాలు


తిరుపతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి జిల్లాలో జెట్‌ వేగంతో దూసుకెళుతోంది. కొద్ది రోజులుగా ఏరోజూ 20కి తక్కువ కాకుండా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా గురువారం కూడా 23 కేసులు నమోదయ్యాయి. తిరుపతి రూరల్‌ మండలంలో 13 కేసులు వెలుగు చూడగా నగరంలో మరో మూడింటిని గుర్తించారు.చిత్తూరు నగరం, శ్రీకాళహస్తి పట్టణం సహా బీఎన్‌ కండ్రిగ, జీడీ నెల్లూరు, పెద్దపంజాణి, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి.


తాజా కేసులతో జిల్లాలో కరోనా వైరస్‌ సోకిన బాధితుల సంఖ్య 617 కాగా పెద్దపంజాణి మండలంలో ఓ కేసు నమోదు కావడంతో వైరస్‌ ఉనికి బయటపడిన మండలాల సంఖ్య 54కు చేరుకుంది. జిల్లాలో అత్యధికంగా 115 కేసులు నమోదైంది శ్రీకాళహస్తిలో కాగా తిరుపతి నగరంలో కేసుల సంఖ్య 76. తిరుపతి ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడ కేసుల పెరుగుదల జిల్లా యంత్రాంగానికి, టీటీడీకి ఆందోళన కలిగిస్తోంది.


Updated Date - 2020-06-19T11:14:15+05:30 IST