అమూల్‌ పాల సేకరణను విజయవంతం చేద్దాం

ABN , First Publish Date - 2020-11-20T04:50:14+05:30 IST

పాలసేకరణను మహిళా సంఘాలు, రైతులు విజయవంతం చేయాలని కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా పేర్కొన్నారు.

అమూల్‌ పాల సేకరణను విజయవంతం చేద్దాం
మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా

కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా

మదనపల్లె రూరల్‌, నవంబరు 19: ఏపీ పాడిపరిశ్రమ సమాఖ్య-అమూల్‌సంస్థ ఆధ్వర్యంలో జరిగే పాలసేకరణను మహిళా సంఘాలు, రైతులు విజయవంతం చేయాలని కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా పేర్కొన్నారు. గురువారం స్థానిక సీఎల్‌ఆర్సీ భవనంలో  మహిళా పాల ఉత్పత్తిదారుల సేకరణపై సెక్రటరీలు, డిజిటల్‌ అసిస్టెంట్లు, స్వయంసహాయక సంఘాల సభ్యులకు విఽధుల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు ఏ సమస్య వచ్చినా ఆర్బీకేలలో పాలసేకరణకు నియమించిన సెక్రటరీలు, మహిళాగ్రూపు సభ్యులు అందుబాటులో ఉండి తీర్చాలన్నారు. రైతులకు అమూల్‌ సంస్థ 10రోజులకోసారి బిల్లులు ఇస్తుందన్నారు. నేటినుంచి 50 గ్రామాల్లో ఆర్బీకే కేంద్రాల ద్వారా పాల సేకరణ జరుగుతుందన్నారు.జేసీ వీరబ్రహ్మం మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగానే అమూల్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ ఎం.జాహ్నవి, డీఆర్‌డీఏ పీడీ ఎం.కె.తులసి, పశుసంవర్థకశాఖ జేడీ వెంకట్రావు, అమూల్‌ ప్రతినిధి అనిల్‌, ఎంపీడీవో లీలామాధవి, తహసీల్దార్‌ కుప్పుస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2020-11-20T04:50:14+05:30 IST