నెలకే చీకిలబైలులో ‘అమూల్‌’ మూత

ABN , First Publish Date - 2020-12-28T06:50:25+05:30 IST

మదనపల్లె మండలం చీకిలబైలులోని రైతుభరోసా కార్యాలయంలో గతనెల 21న మొదలు పెట్టిన ‘అమూల్‌’ పాలసేకరణ కేంద్రం నెలకే మూతపడింది.

నెలకే చీకిలబైలులో ‘అమూల్‌’ మూత
మూతపడిన పాలసేకరణ కేంద్రం

మదనపల్లె రూరల్‌, డిసెంబరు 27: మదనపల్లె మండలం చీకిలబైలులోని రైతుభరోసా కార్యాలయంలో గతనెల 21న మొదలు పెట్టిన ‘అమూల్‌’ పాలసేకరణ కేంద్రం నెలకే మూతపడింది. అమూల్‌కు పాలు పోయడానికి అక్కడి రైతులు ససేమిరా అంటున్నారు. మదనపల్లె, రామసముద్రం మండలాల్లోని 100 కేంద్రాల్లో పాలసేకరణ ప్రారంభించింది. కొన్ని కేంద్రాల్లో పాలసేకరణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. రైతుభరోసా కేంద్రాలతో పాటు అద్దెగదులు తీసుకుని మహిళాసంఘాలను ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. కొన్నిచోట్ల పాల నాణ్యత లేకపోవడంతో తీసుకోవడం లేదు. ఒకరోజు తీసుకుని, మరో రోజు నాణ్యత లేదని తీసుకోకపోవడంతో విసుగుచెందిన పాడి రైతులు పూర్తిగా నిలిపేశారు. దుబ్బిగానిపల్లెలో నలుగురు రైతులు కేవలం 5లేదా 6లీటర్ల పాలే అమూల్‌కు పోస్తున్నట్లు సమాచారం డెయిరీకి ఎన్నిలీటర్లు పాలు వస్తున్నాయో అధికారులు చెప్పడం లేదు.

Updated Date - 2020-12-28T06:50:25+05:30 IST