-
-
Home » Andhra Pradesh » Chittoor » Ammodi expires today
-
నేటితో ముగియనున్న ‘అమ్మఒడి’ గడువు
ABN , First Publish Date - 2020-12-19T06:32:20+05:30 IST
అమ్మఒడి పథకానికి సంబంధించి చైల్డ్ ఇన్ఫో నమోదు, అప్‌డేషన్ కోసం నిర్ణయించిన గడువు శనివారంతో ముగియనుంది.

చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 18: అమ్మఒడి పథకానికి సంబంధించి చైల్డ్ ఇన్ఫో నమోదు, అప్‌డేషన్ కోసం నిర్ణయించిన గడువు శనివారంతో ముగియనుందని డీఈవో నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపై ఎలాంటి మార్పులు చేసుకోవడానికి వీలుండదని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల హెచ్‌ఎంలు, టీచర్లు వ్యక్తిగత శ్రద్ధతో విద్యార్థుల వివరాలను అమ్మఒడి వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. అర్హుల వివరాలు నమోదు చేయకుంటే మాత్రం సంబంధిత విద్యాసంస్థపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.