-
-
Home » Andhra Pradesh » Chittoor » all cases in Chittoor belongs to Chennai only
-
బయటపడ్డ షాకింగ్ నిజం.. చిత్తూరులో నమోదైన కరోనా కేసులన్నింటికీ కారణమదే..!
ABN , First Publish Date - 2020-06-22T17:19:12+05:30 IST
ఇటు తమిళనాడు, అటు కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా వైరస్ అధికమైన నేపథ్యంలో పలువురు చిత్తూరులో తలదాచుకోవడానికొచ్చి తంటాలు పెడుతున్నారు. ఇప్పటి వరకు చిత్తూరులో నమోదైన

చిత్తూరులో నమోదైనవన్నీ చెన్నై కేసులే..
సరిహద్దులో నిర్లక్ష్యమే కారణం
చిత్తూరు (ఆంధ్రజ్యోతి): ఇటు తమిళనాడు, అటు కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా వైరస్ అధికమైన నేపథ్యంలో పలువురు చిత్తూరులో తలదాచుకోవడానికొచ్చి తంటాలు పెడుతున్నారు. ఇప్పటి వరకు చిత్తూరులో నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన వారివే కావడం గమనార్హం. తాజాగా ఆదివారం చిత్తూరులో ఆరు కరోనా కేసులు నమోదుకాగా వాటిలో నలుగురు చెన్నైకు చెందిన వారు. చెన్నై నుంచి గొడుగుమూరుకు వచ్చిన భార్యభర్తలకు వలంటీర్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్సలు చేసుకుని బంధువుల ఇంటికి వచ్చిన అత్తా, కోడలు రెడ్డీస్ కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చారు. వారికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది.
25వ డివిజన్‌లోని బాలాజీ కాలనీకి చెందిన ఓ అమ్మాయి స్వీడన్ నుంచి రెండు రోజుల క్రితం నగరానికి రాగా కరోనా వచ్చింది. రామ్‌నగర్‌కాలనికి చెందిన హోంగార్డుకు ఇది వరకే కరోనా సోకగా.. తాజాగా ఆయన భార్యకు పాజిటివ్ వచ్చింది. కాగా, చెన్నైలో కరోనా విళయతాండవడం చేస్తుండటంతో సమీప మండలాలతో పాటు చిత్తూరుకు చాలా మంది బంధువులు వస్తున్నారు. వీరిలో చాలామందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. వీరివల్ల స్థానికంగా మరికొందరికి సోకే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పోలీసులు సరిహద్దుల వద్ద నిఘా పెంచాల్సి ఉంది. వచ్చేవారిని క్వారంటైన్‌కు పంపి కరోనా పరీక్షలు చేయించాలి.