మద్యం మిగిల్చిన విషాదం

ABN , First Publish Date - 2020-05-08T09:18:59+05:30 IST

స్నేహితులతో కలిసి మద్యం తాగి గొడవ చేయడంతో పెద్దలు మందలించారు.

మద్యం మిగిల్చిన విషాదం

పెద్దలు మందలించారని 

యువకుడి ఆత్మహత్య


తిరుపతి(నేరవిభాగం), మే 7: స్నేహితులతో కలిసి మద్యం తాగి గొడవ చేయడంతో పెద్దలు మందలించారు. దాంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్ట్‌ ఎస్‌ఐ జయచంద్ర తెలిపిన వివరాల మేరకు.. మహేష్‌రెడ్డి (21) అనే యువకుడు నగరంలోని మున్సిపల్‌ కార్యాలయం వెనుకవైపున్న వినాయకనగర్‌ మొదటి  వీధిలో తల్లి సుమిత్రతో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి మహేష్‌రెడ్డి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో వీరు హల్‌చల్‌ చేయడంతో వారి కుటుంబీకులు, స్థానికులు మందలించారు. దాంతో మహేష్‌ వారిపై తిరగబడ్డాడు. ఈ క్రమంలో మహేష్‌ సోదరుడు కూడా గట్టిగా మందలించి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉండిన మహేష్‌ తనింట్లో వెళ్లి రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు రుయాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. సీఐ శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-08T09:18:59+05:30 IST