రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం
ABN , First Publish Date - 2020-11-26T11:14:00+05:30 IST
రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

రూ.లక్ష కోట్లతో మౌలిక వసతులు
దేశంలో 10 వేల రైతు సంఘాల ఏర్పాటు
రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
మదనపల్లె రూరల్, నవంబరు 25: రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన మదనపల్లెలోని ఎన్వీ ఫంక్షన్‌హాలులో మీడియాతో మాట్లాడారు. దేశంలో 10వేల రైతు సంఘాల ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. రూ.లక్ష కోట్లతో శీతల గిడ్డంగులు, పొలాల వద్ద మౌలిక వసతులకు రైతులకే నాబార్డు ద్వారా రుణాలు అందించనున్నారన్నారు. టమోట, పండ్లు సాగు చేస్తే అధిక ఆదాయాలు వస్తాయని, ఆ దిశగా రైతులు ఆలోచించాలని సూచించారు. కిసాన్రైలుతో దేశంలో ఎక్కడికైనా 50శాతం రవాణా సబ్సిడీతో పంట లను ఎగుమతి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు, రాష్ట్ర కార్యదర్శి, రాజంపేట పార్లమెంటరీ ఇన్చార్జి నీలకంఠ, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, రాజంపేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు యల్లంపల్లె ప్రశాంత్, నాయకులు గోపాల్‌రెడ్డి, పెద్దమండ్యం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.