బోయకొండ యాత్ర విషాదాంతం

ABN , First Publish Date - 2020-02-05T23:04:46+05:30 IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో బాలుడు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటనలో చౌడేపల్లె మండలంలో ..

బోయకొండ యాత్ర విషాదాంతం

ద్విచక్రవాహనం బోల్తా పడి బాలుడి మృతి
తల్లిదండ్రులకు తీవ్రగాయాలు

చౌడేపల్లె, ఫిబ్రవరి 4: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో బాలుడు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటనలో చౌడేపల్లె మండలంలో మంగళవారం సాయంత్రం జరిగింది. బాధితుల కథనంమేరకు వివరాలు.. మదనపల్లెకు చెందిన రాజేష్‌(52) తన ద్విచక్రవాహనంలో తన భార్య సరేఖ(45), కుమారుడు దీపక్‌(7)తో బోయకొండ గంగమ్మను దర్శించుకోవటానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో రణబేరి గంగమ్మను దర్శించుకున్నారు.
 
కొండ కిందకు వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. సురేఖ కుడికాలు విరగడంతో పాటు తల, చేతికి గాయాలయ్యాయి. చిన్నారి దీపక్‌ తలకు బలమైన గాయం కావటంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. క్షతగాత్రులను 108 వాహనంతో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

Updated Date - 2020-02-05T23:04:46+05:30 IST