మున్సిపోల్స్‌ విధుల నుంచి ‘రెవిన్యూ’ను మినహాయించండి

ABN , First Publish Date - 2020-02-05T23:04:46+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల ఏర్పాట్ల విధుల నుంచి రెవెన్యూ అధికారులను మినహాయించాలని భూపరిపాలనా శాఖ చీఫ్‌ కమిషనర్‌ కలెక్టర్‌కు ..

మున్సిపోల్స్‌ విధుల నుంచి ‘రెవిన్యూ’ను మినహాయించండి

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 4: మునిసిపల్‌ ఎన్నికల ఏర్పాట్ల విధుల నుంచి రెవెన్యూ అధికారులను మినహాయించాలని భూపరిపాలనా శాఖ చీఫ్‌ కమిషనర్‌ కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఉగాది పండుగ పురస్కరించుకుని మార్చి 25 నాటికి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమం వీరు నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ కారణంగా మునిసిపల్‌ ఎన్నికల విధుల నుంచి జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో, సబ్‌ కలెక్టర్‌, మండల తహసీల్దార్లను మినహాయించాలని చీఫ్‌ కమిషనర్‌ ఆ ఉత్తర్వులలో కోరారు. వారి స్థానంలో జేసీ-2, జడ్పీ సీఈవో, డీపీవో, ఎంపీడీవో, మునిసిపల్‌ కమిషనర్లను ఎన్నికల విధులకు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-02-05T23:04:46+05:30 IST