తిరుమల పరిసరాల్లో చార్టర్డ్‌ ఫ్లైట్‌ చక్కర్లు

ABN , First Publish Date - 2020-02-05T23:04:45+05:30 IST

తిరుమల పుణ్యక్షేత్రం పరిసరాల్లో గత రెండు రోజుల నుంచి ఓ చార్టర్డ్‌ ఫ్లైట్‌ చకర్లు కొట్టడం కలకలం సృష్టిస్తోంది.

తిరుమల పరిసరాల్లో చార్టర్డ్‌ ఫ్లైట్‌ చక్కర్లు

తిరుమల, ఫిబ్రవరి 4: తిరుమల పుణ్యక్షేత్రం పరిసరాల్లో గత రెండు రోజుల నుంచి ఓ చార్టర్డ్‌ ఫ్లైట్‌ చకర్లు కొట్టడం కలకలం సృష్టిస్తోంది. ఆగమశాస్త్ర నిబంధనల మేరకు శ్రీవారి ఆలయ విమానం (గోపురం)పై విమానాలు తిరగడం నిషిద్ధం. నాలుగేళ్ల క్రితం కూడా తరుచూ ఇలా విమానాలు, హెలికాప్టర్లు కొండ పరిసరాల్లో తిరగడంతో విమర్శలకు దారితీసింది. దీంతో తిరుమల పుణ్యక్షేత్రాన్ని నోఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ కేంద్రానికి ఓ లేఖ కూడా రాసింది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లభించలేదు
 
. తిరుమలకు ముప్పు పొంచిఉందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనూ ఇలా విమానాలు తిరగడం ఆందోళన కలిగిస్తోంది. గర్భాలయం మీదుగా కాకపోయినా.. ఈ విమానం ఆలయ పరిసరాల్లో సోమ, మంగళవారాల్లో చకర్లు కొట్టింది. ఈ అంశంపై విజిలెన్స్‌ అధికారులు ప్రశ్నించగా తమకు ఎలాంటి సమాచారం లేదని, చెన్నై ఏటీసీ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌)కు ఫిర్యాదు చేస్తామని బదులిచ్చారు. కాగా, ఇది ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ వారి సర్వే విమానంగా విభాగం వర్గాలు తెలిపాయి.

Updated Date - 2020-02-05T23:04:45+05:30 IST