పుంగనూరు చేరిన హంద్రీనీవా జలాలు

ABN , First Publish Date - 2020-02-05T23:04:45+05:30 IST

హంద్రీనీవా కాల్వల ద్వారా కృష్ణాజలాలు మంగళవారం పుంగనూరుకు చేరుకున్నాయి. కొంత కాలంగా హంద్రీనీవా జలాలు పుంగనూరు సమీపం ..

పుంగనూరు చేరిన హంద్రీనీవా జలాలు

పుంగనూరు, ఫిబ్రవరి 4: హంద్రీనీవా కాల్వల ద్వారా కృష్ణాజలాలు మంగళవారం పుంగనూరుకు చేరుకున్నాయి. కొంత కాలంగా హంద్రీనీవా జలాలు పుంగనూరు సమీపం వరకు రావడం, ఆగిపోవడం జరుగుతోంది. మంగళవారం ఒకసారిగా నీరు పుంగనూరుకు చేరడంతో ఇరిగేషన్‌, మున్సిపల్‌ అధికారులు సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంక్‌ వద్ద గల పంపుహౌస్‌కు మళ్లీంచారు.
 
కాగా పదేళ్ల క్రితం పుంగనూరులో తాగునీటి సమస్య పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగమ్మ చెరువులో సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మించారు. నీటి సౌలభ్యం లేకపోవడంతో ఇప్పటి వరకు ఎస్‌ఎస్‌ ట్యాంకుకు నీరు చేరలేదు. ప్రస్తుతం హంద్రీనీవా జలాలు రావడంతో బుధవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పూజలు చేసి ఎస్‌ఎస్‌ ట్యాంక్‌కు నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణా జలాలను, పంపుహౌస్‌లను మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌.వర్మ, డీఈ రమణ తదితరులు పరిశీలించి నీటి విడుదలకు ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2020-02-05T23:04:45+05:30 IST