ద్విచక్రవాహనాలు ఢీకొని: వలంటీర్‌ మృతి

ABN , First Publish Date - 2020-12-19T05:44:55+05:30 IST

మదనపల్లె మండలం దిగెవమాచిరెడ్డిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామ వలంటీర్‌ భరత్‌ మృతిచెందాడు.

ద్విచక్రవాహనాలు ఢీకొని: వలంటీర్‌ మృతి
మృతిచెందిన భరత్‌కుమార్‌

నిమ్మనపల్లె, డిసెంబరు 18: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో మదనపల్లె మండలానికి చెందిన ఓ గ్రామ వలంటీర్‌ మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు మదనపల్లె మండలం మాలేపాడుకు చెందిన గుడిసి భరత్‌కుమార్‌రెడ్డి(21) ఇదే గ్రామ హరిజనవాడ వలంటీర్‌గా పనిచేస్తున్నారు. కాగా, శుక్రవారం ఆయన స్నేహితుడిని కలిసేందుకు ద్విచక్రవాహనంలో నిమ్మనపల్లెకు బయలుదేరారు. ఇదే మండలం రెడ్డివారిపల్లెకు చెందిన బాలనాగు గంగాధర(24), బాలే అనిల్‌కుమార్‌(22) సొంత పనుల నిమిత్తం మదనపల్లెకు వస్తూ దిగువమాచిరెడ్డిగారిపల్లె మలుపు వద్దకు వచ్చారు. అదే సమయంలో ఎదురుగా భరత్‌ కూడా రావడంతో ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. తలకు తీవ్ర గాయమైన వలంటీర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, గంగాధర్‌, అనిల్‌కుమార్‌ అతివేగంగా వాహనంలో వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. 

Read more