ఆ వైసీపీ నాయకుల నుంచి కాపాడండి

ABN , First Publish Date - 2020-12-15T06:58:27+05:30 IST

రామచంద్రాపురం మండలం సొరకాయల పాళ్యంలోని భూమిపై కోర్టు స్టే ఉన్నా వైసీపీ నాయకులు సచివాలయ భవనం నిర్మించేయత్నం చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఆ వైసీపీ నాయకుల నుంచి కాపాడండి

ఏఎస్పీకి బాధితుడి వేడుకోలు  


తిరుపతి(నేరవిభాగం)/రామచంద్రాపురం, డిసెంబరు 14: ‘వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు. వారినుంచి మమ్మల్ని కాపాడండి’ అంటూ రామచంద్రాపురం మండలం సొరకాయల పాళ్యం గ్రామానికి చెందిన కె. చంద్రబాబు కుటుంబీకులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. తిరుపతి అర్బన్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో వీరు అదనపు ఎస్పీ ఆరీఫుల్లాకు ఫిర్యాదు చేశారు. గ్రామకంఠానికి చెందిన భూమిని పూర్వీకులనుంచి అనుభవిస్తు న్నామని, భాగ పరిష్కారాల్లో భాగంగా ఆ భూమిని తనకు రిజిస్ట్రేషన్‌ చేయించారని చంద్రబాబు తెలిపారు. ఆ భూమిలో గ్రామ సచివాలయ భవన నిర్మాణం చేపట్టాలని వైసీపీ నేతలు కుప్పం భాస్కర్‌యాదవ్‌, ప్రతాప్‌, జయరామయ్య ప్రయత్నించా రన్నారు. వీరికి రెవెన్యూ అఽధికారులు కూడా సహకరిస్తుండటంతో తాను హైకోర్టునుంచి స్టే తీసుకొచ్చానని వివరించారు. స్టే ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు తన భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి భవనం నిర్మిస్తున్నారన్నారు. దీనిని ప్రశ్నిస్తున్నందుకు తనను అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో ఓ నేతపై ఆర్సీ పురం పోలీసు స్టేషన్‌లో 20 కేసు లున్నా వారు చర్యలు తీసుకోవడంలేదని ఫిర్యాదు చేశారు. అధికా రులు జోక్యం చేసుకుని సచివాలయ భవన నిర్మాణ పనులను ఆపాలని కోరారు. కుప్పం భాస్కర్‌యాదవ్‌, ఆయన అనుచరులపై తక్షణం చర్యలు తీసుకోవాలని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ ఏఎస్పీని కోరారు.

Read more