92 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-12-05T06:56:55+05:30 IST

జిల్లాలో గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ 92 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది.

92 కరోనా కేసులు నమోదు

వైరస్‌తో ఒకరి మృతి 


తిరుపతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ 92 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. అదే వ్యవధిలో వైరస్‌ బారినపడి ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 86,748కి చేరుకోగా.. మరణాల సంఖ్య 831కి చేరాయి. కాగా, శుక్రవారం ఉదయం 9 గంటలకు 521 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయని అధికారులు ప్రకటించారు.

Updated Date - 2020-12-05T06:56:55+05:30 IST