-
-
Home » Andhra Pradesh » Chittoor » 89 corona cases one death
-
89 కరోనా కేసులు....ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-12-06T07:41:35+05:30 IST
89మందికి కరోనా వైరస్ సోకినట్టు అధికార యం త్రాంగం నిర్ధారించింది.

తిరుపతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవా రం ఉదయం 9గంటల నుంచీ శనివారం ఉదయం9 గంటల వరకూ 89మందికి కరోనా వైరస్ సోకినట్టు అధికార యం త్రాంగం నిర్ధారించింది. అదే వ్యవధిలో వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కొత్తగా గుర్తించిన కేసులతో జిల్లాలో కరోనా కేసులు86837కు చేరుకోగా అందులో యాక్టివ్ కేసులు 553 వున్నాయి. మొత్తం కరోనా మరణాలు 832కు చేరాయి.
రుయాలో ర్యాపిడ్ టెస్టుల నిలిపివేత
తిరుపతి (వైద్యం), డిసెంబరు 5: తిరుపతి రుయాస్పత్రిలో కరోనా వ్యాధి నిర్ధారణ కోసం నిర్వహించే పరీక్షల్లో ఒకటైన ర్యాపిడ్ టెస్టును రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపేశారు. ఇకపై కరోనా లక్షణాలతో వచ్చే బాధితులకు ఆర్టీపీసీఆర్ ద్వారానే వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి తెలిపారు.ఏ రోజు శాంపిల్ తీసుకుంటారో, అదే రోజు పరీక్ష ఫలితాలు వెల్లడించాలని ఆదేశాలిచ్చారు.
‘ఈఎస్‌ఐ’లో రేపటినుంచి ఇన్ పేషెంట్స్ సేవలు
తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సోమవారం నుంచి ఇన్ పేషెంట్స్ వైద్య సేవలు పునఃప్రారంభం అవుతాయని సూపరింటెండెంట్ డాక్టర్ కె.బాలశంకర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో గత నెలలోనే కొవిడ్ సేవలు నిలిపేశామన్నారు.నూతన భవనంలోకి ఆస్పత్రిని మార్చి, అవుట్ పేషెంట్ సేవలను కొన్ని రోజులుగా అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఇన్ పేషెంట్లను అడ్మిట్ చేసుకుని, వైద్యసేవలు అందించడానికి సిద్ధమయ్యామన్నారు.