-
-
Home » Andhra Pradesh » Chittoor » 25 tamilians arrested by police
-
టాస్క్‌ఫోర్స్ అదుపులో 25మంది తమిళులు
ABN , First Publish Date - 2020-12-19T07:21:35+05:30 IST
ఎర్రచందనం కోసం శేషాచలం అడవుల్లోకి వెళ్ళడానికి వచ్చినట్లు అనుమానిస్తున్న 25మంది తమిళనాడు వాసులను టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకుంది.

ఎర్రచందనం రవాణాకు వచ్చినట్లు అనుమానం
వీరిలో అటవీ అధికారుల హత్య కేసు ముద్దాయి
వడమాలపేట/తిరుపతి (అటవీశాఖ), డిసెంబరు 18: ఎర్రచందనం కోసం శేషాచలం అడవుల్లోకి వెళ్ళడానికి వచ్చినట్లు అనుమానిస్తున్న 25మంది తమిళనాడు వాసులను టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకుంది.డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఐలు వాసు, సురేష్, డీఆర్వో నరసింహారావు వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద గురువారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ లారీలో 25మంది తమిళనాడువాసులున్నారు. 75 కిలోల బియ్యం, పప్పు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులతో పాటు చెట్లను కొట్టేందుకు ఉపయోగించే గడ్డపారలు వారితో ఉన్నాయి. విచారించగా గతంలో అటవీశాఖ అధికారుల హత్య కేసులో ముద్దాయి అర్జున్ అనే వ్యక్తి కూడా వీరిలో వున్నట్లు తేలింది.లారీ డ్రైవర్‌తో పాటు అనుమానితుల నుంచి సమాచారం రాబట్టారు. ఎర్రచందనం చెట్లను నరికేందుకు వచ్చినట్లు చెబుతున్నారు. సీఐ సుబ్రమణ్యం కేసు నమోదు చేశారు.