టీచర్ల బదిలీలపై 220 అభ్యంతరాలు
ABN , First Publish Date - 2020-12-05T06:23:26+05:30 IST
టీచర్ల బదిలీలకు సంబంధించి 220 అభ్యంతరాలు వచ్చినట్లు డీఈవో చెప్పారు.

చిత్తూరు(సెంట్రల్), డిసెంబరు 4: టీచర్ల బదిలీలకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణకు గురువారంతో గడువు ముగిసింది. బదిలీలు కోరుతూ జిల్లాలోని ఉపాధ్యాయులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. వీటిపై 220 అభ్యంతరాలు రాగా, శుక్రవారం నుంచి విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ ఏడీ పురుషోత్తం తెలిపారు. అనంతరం తుది ఆమోదం కోసం జేసీ(అభివృద్ధి)కి పంపనున్నట్లు వివరించారు. సమయపాలన పాటించని వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు టీచర్లు, ఓ రికార్డు అసిస్టెంట్‌కు డీఈవో శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేశారు.