కరోనాకు 11మంది బలి

ABN , First Publish Date - 2020-09-13T08:45:57+05:30 IST

: కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. మరో 11మందిని వైరస్‌ బలి తీసుకుంది.వీరితో కలిపి జిల్లాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 520కి చేరింది. కాగా గడచిన 24 గంటల్లో మరో 934 మందికి కరోనా సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది.

కరోనాకు 11మంది బలి

 మరో 934మందికి సోకిన వైరస్‌

51397కు చేరిన మొత్తం పాజిటివ్‌లు


తిరుపతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. మరో 11మందిని వైరస్‌ బలి తీసుకుంది.వీరితో కలిపి జిల్లాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 520కి చేరింది. కాగా గడచిన 24 గంటల్లో మరో 934 మందికి కరోనా సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. వీరిలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచీ శనివారం ఉదయం 9 గంటల వరకూ 267 మందిని గుర్తించగా శనివారం ఉదయం 9 నుంచీ రాత్రి 7 గంటల వరకూ మరో 667 మందిని గుర్తించింది. ఈ 667 కేసులు తిరుపతి నగరంలో 152, చిత్తూరులో 123, శ్రీకాళహస్తిలో 71, మదనపల్లెలో 52, పలమనేరు, తిరుపతి రూరల్‌ మండలాల్లో 20 చొప్పున, పెనుమూరులో 18, పుంగనూరు, సోమల మండలాల్లో 17 వంతున, పెద్దపంజాణిలో 14, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో 13 వంతున, నగరిలో 11, కేవీబీపురం, తొట్టంబేడు మండలాల్లో 10 చొప్పున, పుత్తూరులో 9, కలికిరి, తవణంపల్లె మండలాల్లో 8 వంతున, కుప్పం, ఎస్‌ఆర్‌పురం మండలాల్లో 7 వంతున, ఐరాలలో 6, గంగవరం, సదుం మండలాల్లో 5 చొప్పున, కార్వేటినగరం, వరదయ్యపాళ్యం మండలాల్లో 4 వంతున, చిన్నగొట్టిగల్లు, పిచ్చాటూరు, చౌడేపల్లె, పీలేరు, వడమాలపేట మండలాల్లో 3 చొప్పున, బైరెడ్డిపల్లె, బీఎన్‌ కండ్రిగ, జీడీనెల్లూరు, గుడిపాల, రామకుప్పం, రొంపిచెర్ల, సత్యవేడు మండలాల్లో 2 చొప్పున, బి.కొత్తకోట, బంగారుపాళ్యం, చంద్రగిరి, గుర్రంకొండ, కేవీపల్లె, ములకలచెరువు, నిమ్మనపల్లె, నిండ్ర, పులిచెర్ల, రామసముద్రం, తంబళ్ళపల్లె, వాల్మీకిపురం, వెదురుకుప్పం, వి.కోట మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. కాగా తాజా కేసులతో జిల్లాలో ఇప్పటివరకూ జిల్లా యంత్రాంగం నిర్ధారించిన కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 51397కు చేరుకుంది.


 143 మంది డిశ్చార్జి

కరోనా నుంచి కోలుకున్న 143 మంది శనివారం డిశ్చార్జయ్యారు. వీరిలో శ్రీపద్మావతి రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 57మంది,రుయా కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 22 మంది, శ్రీనివాసం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నుంచి 64 మంది వున్నట్లు  తెలిపారు. 

Updated Date - 2020-09-13T08:45:57+05:30 IST