‘వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక’కు దరఖాస్తు చేసుకోండిలా..

ABN , First Publish Date - 2020-03-02T10:10:02+05:30 IST

వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటునందించి వివాహ రిజిస్ర్టేషన్‌ ద్వారా వధువుకు చట్టబద్ధతతోపాటు రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

‘వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక’కు దరఖాస్తు చేసుకోండిలా..

అనంతపురం వ్యవసాయం, మార్చి 1 :  వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటునందించి  వివాహ రిజిస్ర్టేషన్‌ ద్వారా వధువుకు చట్టబద్ధతతోపాటు రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులు జిల్లాలోని వెలుగు మండల మహిళా సమాఖ్యల్లో పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి జరిగే తేదీకి ఐదు రోజులు ముందుగానే తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి పేర్కొన్నారు. 


పథకానికి అర్హతలు... 

వధువు, వరుడు ఇద్దరు రాష్ర్టానికి చెందిన వారై ఉండాలి. పెళ్లి తేదీ నాటికి పెళ్లి కుమార్తె వయస్సు 18 సంవత్సరాలు, పెళ్లి కుమారుడి వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. మొదటి సారి వివాహం చేసుకునే వారు మాత్రమే అర్హులు. భర్త చనిపోయిన వితంతువులను మాత్రమే రెండో వివాహం చేసుకున్నా అర్హులుగా పరిగణిస్తారు. 


దరఖాస్తు చేసుకునే సమయానికి వివాహం జరిగే తేదీ, సమయం వేదిక నిర్ణయించాలి.  ఏపీ రాష్ట్ర పరిధిలోనే వివాహం జరగాలి. వధువు, వరుడు ఇద్దరు ఆధార్‌ కార్డు కలిగి ఉండి ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి. వధువు కుటుంబం తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండాలి. 


నమోదుకు కావాల్సిన పత్రాలు .. ఆధార్‌ కార్డు, తెల్లరేషన్‌ కార్డు. 

మీసేవా కేంద్రం ద్వారా జారీ చేసిన కుల,నివాస, జనన ధ్రువీకరణ పత్రం (ఇంటిగ్రేటెడ్‌ పత్రం) 

ఆధార్‌తో సీడ్‌ చేయబడిన వదువు బ్యాంక్‌ ఖాతా వివరాలు. 

అంగవైకల్యం కలిగిన వారైతే సదరం సర్టిఫికెట్‌. 

ఏపీ బిల్డింగ్‌, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యత్వం  కలిగిన వారైతే రిజిస్ర్టేషన్‌ సంఖ్య (ఓసీలకు కూడా వర్తిస్తుంది) 

వధువు, వరుడు ఇద్దరి మొబైల్‌ నెంబర్‌ ఆధార్‌తో అనుసంధానం చేయబడి ఉండాలి. 


పెళ్లి కానుక ప్రోత్సాహకాల వివరాలు.. 

వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి పెంచిన మొత్తం అమల్లోకి వస్తుంది. 


పెళ్లికానుక (కేటగిరి) ప్రస్తుత ప్రోత్సాహకం        పెంచిన ప్రోత్సాహకం 

ఎస్సీలు రూ.40 వేలు రూ.లక్ష 

ఎస్సీ కులాంతర రూ.75 వేలు రూ.1.20 లక్షలు 

గిరి పుత్రిక రూ.50 వేలు రూ.లక్ష 

ఎస్టీ కులాంతర రూ.75 వేలు రూ.1.20 లక్షలు 

బీసీలు రూ.35 వేలు రూ.50 వేలు 

బీసీ కులాంతర రూ.50 వేలు రూ.75 వేలు 

దుల్హన్‌ రూ.50 వేలు రూ.లక్ష 

దివ్యాంగులు రూ.లక్ష          రూ.1.50 లక్షలు 

భవన నిర్మాణ కార్మిక 

సంక్షేమ సర్టిఫికెట్‌

కలిగిన వ్యక్తులు రూ.20 వేలు రూ.లక్ష 

Updated Date - 2020-03-02T10:10:02+05:30 IST