పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే వైసీపీ నేతల బాహాబాహి

ABN , First Publish Date - 2020-06-25T20:28:17+05:30 IST

వైసీపీ నాయకులు సాక్షాత్తు పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే బాహాబాహికి దిగారు. దీంతో పోలీసులే నివ్వెరబోయారు. యాడికిలోని కోట వీధికి చెందిన

పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే వైసీపీ నేతల బాహాబాహి

యల్లనూరు(అనంతపురం): వైసీపీ నాయకులు సాక్షాత్తు పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే బాహాబాహికి దిగారు. దీంతో పోలీసులే నివ్వెరబోయారు. యాడికిలోని కోట వీధికి చెందిన వైసీపీ మద్దతుదారుల మధ్య బుధవారం పొలం వద్ద రస్తా విషయమై ఘర్షణ తలెత్తింది. తన పొలం మధ్య నుంచి ఆంజనేయులు ట్రాక్టర్‌ను తీసుకు వెళుతుండగా చంద్ర అడ్డుచెప్పాడు. విషయం తెలుసుకున్న చంద్ర, ఆంజనేయులు వర్గీయులు దాడులకు దిగారు. దీంతో ఇరువర్గాలకు చెం దిన శీనా, వినోద్‌, హరికి రక్తగాయాలయ్యాయి. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవటానికి వచ్చారు. స్టేషన్‌ ఆవరణలో మరోసారి ఘర్షణ పడ్డారు. ఇరువర్గాల ఫిర్యాదులు తీసుకుని, విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ మోహన్‌గౌడ్‌ తెలిపారు.

Updated Date - 2020-06-25T20:28:17+05:30 IST