అనంత విశ్వవిద్యాలయాలకు ప్రపంచ ర్యాంకులు
ABN , First Publish Date - 2020-09-03T10:40:24+05:30 IST
ప్రపంచ ర్యాంకింగ్స్-2021లో అనంత విశ్వవిద్యాలయాలకు సముచిత స్దానం లభించింది...

జేఎన్‌టీయూ, సెప్టెంబరు 2: ప్రపంచ ర్యాంకింగ్స్-2021లో అనంత విశ్వవిద్యాలయాలకు సముచిత స్దానం లభించింది. జేఎన్‌టీయూకు 63వ ర్యాంకు రాగా, ఎస్కేయూకు 91వ స్థానం దక్కింది. ఆయా వర్సిటీల్లో బోధన, పరిశోధనలు, విస్తరణ అంశాలు, ఆవిష్కరణలతో పాటు ప్రాంగణ నియామకాలను ప్రామాణికం గా తీసుకుని, ర్యాంకులు ప్రకటించారు.