చికిత్సపొందుతూ మహిళ మృతి

ABN , First Publish Date - 2020-12-15T06:37:11+05:30 IST

మండల కేంద్రంలోని ముక్తాపురం క్రాస్‌ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన ము క్తాపురం తండాకు చెందిన సరోజినీబాయ్‌(48) కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.

చికిత్సపొందుతూ మహిళ మృతి

ముదిగుబ్బ, డిసెంబరు 14: మండల కేంద్రంలోని ముక్తాపురం క్రాస్‌ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన ము క్తాపురం తండాకు చెందిన సరోజినీబాయ్‌(48) కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆమె ముదిగుబ్బ నుంచి ఆటోలో స్వగ్రామానికి వెళ్తోంది. స్టేజ్‌ వద్ద దిగి ఆటో డ్రైవర్‌కు డబ్బులు ఇస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి బైకులో వ చ్చిడీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమచికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్టు ఎస్‌ఐ తెలిపారు.


Read more