ఇంటిపట్టాల పంపిణీలో ప్రోటోకాల్‌ ఎక్కడ?

ABN , First Publish Date - 2020-12-26T06:32:11+05:30 IST

వైసీపీ పాలనలో ముఖ్యమంత్రికాని మంత్రులుకానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ మొదట మాట్లాడేది మహిళలకు పెద్దపీట వేస్తున్నామని కానీ సాక్షాత్తు ఓ రాష్ట్రస్థాయి డైరెక్టర్‌కే చోటు ఇవ్వకుండా వేదికపై వెనుక వరుసకు నెట్టిన వైనం హిందూపురంలో చోటుచేసుకుంది

ఇంటిపట్టాల పంపిణీలో ప్రోటోకాల్‌ ఎక్కడ?
వెనుక వరుసలో నిలబడి ఉన్న డైరెక్టర్‌ నాగజ్యోతి (వృత్తంలో)



- బీసీ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్లకు దక్కని గౌరవం

- ఓ డైరెక్టర్‌ సమావేశం నుంచి వెనక్కు 


హిందూపురం టౌన్‌, డిసెంబరు 25: వైసీపీ పాలనలో ముఖ్యమంత్రికాని మంత్రులుకానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ మొదట మాట్లాడేది మహిళలకు పెద్దపీట వేస్తున్నామని కానీ సాక్షాత్తు ఓ రాష్ట్రస్థాయి డైరెక్టర్‌కే  చోటు ఇవ్వకుండా వేదికపై వెనుక వరుసకు నెట్టిన వైనం హిందూపురంలో చోటుచేసుకుంది. శుక్రవారం ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తొగట కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ నాగజ్యోతి, బెస్త కార్పొరేషన్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణలు హాజరయ్యారు. అయితే నాగజ్యోతి ఎలాగో వేదికపైకి వెళ్లింది. కానీ లక్ష్మీనారాయణ వేదికమీదకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని మిమ్మల్ని పిలువలేదు పిలిచిన వారు మాత్రమే సభావేదికపైకి వెళ్లాలన్నారు. దీంతో ఆయన కొంతసేపు వేచి ఉండి అసహనం వ్యక్తంచేసి వెనుతిరిగారు. నాగజ్యోతి మాత్రం వెనుకాల వరుసలో నిలబడింది. ఇదిలా ఉంటే ముందు వరుసలో ఎమ్మెల్సీ, అధికారులు తప్పా మిగిలిన చోటామోటా నాయకులే కూర్చున్నారు. కానీ రాష్ట్రస్థాయి డైరెక్టర్‌లకు ప్రొటోకాల్‌ పాటించకపోవడం విమర్శలకు తావిచ్చింది. అంతేకాక బీసీలకు పెద్దపీట వేస్తోందని చెబుతున్న ప్రభు త్వం సభావేదిక పైకి ఆహ్వానించకపోవడంతో బీసీ నాయకులు విమర్శిస్తున్నారు. అధికారులకు గుర్తులేకపోయినా ఎమ్మెల్సీ గుర్తించాల్సిన అవసరం ఉందని బీసీ సంఘం నాయకులు మండిపడ్డారు. 


Updated Date - 2020-12-26T06:32:11+05:30 IST