పేదలందరికీ సంక్షేమ ఫలాలు
ABN , First Publish Date - 2020-09-12T09:11:38+05:30 IST
జిల్లాలోని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎ్‌సఆర్ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిం

‘వైఎస్‌ఆర్ ఆసరా’తో పొదుపు సంఘాలకు లబ్ధి
: మంత్రి శంకరనారాయణ
అనంతపురం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎ్‌సఆర్ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి మంత్రి శంకరనారాయణతోపాటు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, షేక్ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఉషశ్రీచరణ్‌లు సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
మంత్రి మాట్లాడుతూ వైఎ్‌సఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి పొదుపు సంఘాల మహిళలకిచ్చిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారన్నారు. వైఎ్‌సఆర్ ఆసరా ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు లబ్ధి చేకూరనుందన్నా రు. కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో వైఎ్‌సఆర్ ఆసరా ద్వారా 59063 పొదుపు సంఘాల్లోని 5.90 లక్షల మంది లబ్ధిదారులకు రూ.450.24 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. డీఆర్‌డీఏ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 47325 సంఘాలకు రూ. 362.91 కోట్లు, మెప్మా పరిధిలోని పట్టణ ప్రాంతాలకు చెందిన 11738 సంఘాలకు రూ.87.33 కోట్ల లబ్ధి కలుగుతోందన్నారు.
అనంతరం వైఎ్‌సఆర్ ఆసరా లబ్ధికి సంబంధించిన మెగా చెక్కును మంత్రితోపాటు జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో ఆసరా, సంక్షేమం జేసీ గంగా ధర్‌గౌడ్, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, మెప్మా పీడీ రమణారెడ్డి, స్వయంసహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.