-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Welfare benefits beyond politics
-
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు
ABN , First Publish Date - 2020-12-27T06:20:39+05:30 IST
వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు.

మంత్రి శంకరనారాయణ
గోరంట్ల, డిసెంబరు 26: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. గోరంట్ల పట్టణంలో ఇళ్లపట్టాల పంపిణీలో భాగంగా శనివారం పలు అభివృద్ధి పథకాల్లో భాగంగా భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నిషాంతి పాల్గొన్నారు. హిందూపురం, కదిరి, ప్రధాన రహదారి పక్కన 35.64ఎకరాల్లో ఏడు లేఔట్ల ద్వారా 1296మంది నిరుపేదలకు పట్టాలను వారు పంపిణీ చేశారు. స్థలాలున్న 1760మందికి పక్కా గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మండల కాంప్లెక్స్ వద్ద రూ.4.55కోట్లతో ఏర్పాటు చేసిన వైఎ్‌సఆర్ సుజలస్రవంతి వాటర్‌ప్లాంట్ నీటి సరఫరా కోసం ట్రాక్టర్లను ప్రారంభించారు. రావికుంట చెరువులో రూ.50లక్షల వ్యయంతో నిర్మిస్తున్న చిన్న పిల్లల పా ర్కుకు భూమిపూజ చేశారు. మార్కెట్‌వద్ద షాపింగ్ కాం ప్లెక్స్ గదులు, ఆర్‌కె థియేటర్ వీధిలో సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. 14నెలల వ్యవధిలో 1296మందికి ఇళ్లపట్టాల కోసం 35.64ఎకరాలను తీర్చిదిద్దారని సబ్‌కలెక్టర్ నిషాంతి అధికారులను అభినందించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ నాగరాజు, తహసీల్దార్ రామాంజినరెడ్డి, ఎంపీడీఓ అంజినప్ప, ఏఈ కులచంద్రారెడ్డి, సీఐ జయానాయక్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, ఈఓ సతీ్‌షకుమార్, వైసీపీ నాయకులు మల్లికార్జున, కన్వీనర్ ఫకృద్దీన, మేదరశంకర, మార్కెట్‌యార్డ్ చైర్మన వేణుగోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన నూర్‌మహ్మద్, ఏడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ కళిగేరి శంకర్‌రె డ్డి, పాలే జయరాంనాయక్, రాజారెడ్డి, డా.బాష, హిదాయతుల్లా, కుటాలబాబు, రంగారెడ్డి, నాగేనాయక్, భాస్కర్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, ఎంసీ నరసింహులు, ముసలిరెడ్డి పాల్గొన్నారు.