మాస్కులు ధరించి భౌతికదూరాన్ని పాటించాలి
ABN , First Publish Date - 2020-04-28T10:00:57+05:30 IST
మార్కెట్‌కు వచ్చే ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని నగరపాలక సంస్థ

నగరపాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి
అనంతపురం కార్పొరేషన్, ఏప్రిల్ 27: మార్కెట్‌కు వచ్చే ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కూరగాయల మార్కెట్‌లను ఆమె సందర్శించారు. ప్రజలు గుంపులుగా వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దుకాణదారులు జాగ్రత్తలు పాటించకుంటే మూసి వేయిస్తామని హెచ్చరించారు. అనంతరం శారదా స్కూల్‌లో మాస్కుల తయారీ కేంద్రాన్ని పరిశీలించి, త్వరతగతిన తయారు చేయాలని సూచించారు.