-
-
Home » Andhra Pradesh » Ananthapuram » We develop all kinds of teams
-
తండాలను అన్నివిధాల అభివృద్ధి చేస్తాం
ABN , First Publish Date - 2020-12-28T06:11:11+05:30 IST
ఆంధ్ర, తెలంగాణ రాషా్ట్రలలోని తం డాలను అన్ని విధాల అభివృద్ధి చే స్తామని కేరళ ఐజీ లక్ష్మణ్‌నాయక్ పేర్కొన్నారు.

కేరళ ఐజీ లక్ష్మణ్‌నాయక్
పుట్టపర్తిరూరల్, డిసెంబర్ 27: ఆంధ్ర, తెలంగాణ రాషా్ట్రలలోని తం డాలను అన్ని విధాల అభివృద్ధి చే స్తామని కేరళ ఐజీ లక్ష్మణ్‌నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని పెడపల్లిలో న్యూలైఫ్ లోడింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాషా్ట్రలలోని అత్యంత వెనుక బడిన గిరిజనులను అన్నివిధాల అదుకొని అభివృద్ధి పథంలో నడిపించడంకోసం తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకు ముందువారు ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాఏపీ అగ్నిమాపక డైరక్టర్ జయరాంనాయక్, బెంగళూరు ఇనక మ్‌టాక్స్ కమిషనర్ మేఘనాథ్, పంచాయతీ రాజ్ చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్ బాలాజీ నాయక్, విశ్వనాథ్, రాయలసీమ యూనివర్శిటీ వీసీ హరికృష్ణనాయక్, ఎంపీడీఓ నరేష్ కృష్ణ, ఎంఈఓ వెంకటరమణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు