-
-
Home » Andhra Pradesh » Ananthapuram » We are effectively implementing the lockdown
-
లాక్‌డౌన్ సమర్థంగా అమలు చేస్తున్నాం
ABN , First Publish Date - 2020-03-25T11:15:17+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ వ్యా ప్తిని నియంత్రించటంలో భాగంగా లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అ మలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.. రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి వివరించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌కు వివరించిన కలెక్టర్
అనంతపురం,మార్చి24(ఆంద్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ వ్యా ప్తిని నియంత్రించటంలో భాగంగా లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అ మలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.. రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి వివరించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి విజయవాడ నుంచి సీఎస్ నీలం సాహ్ని.. జిల్లా కలెక్టర్, డీఐజీ, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గంధం చంద్రుడుతో పాటు డీఐజీ కాంతిరాణాటాటా, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీ ఢిల్లీరావ్, ట్రైనీ కలెక్టర్ జాహ్నవి హాజరయ్యారు. కలెక్టర్ జిల్లాలో పరిస్థితిని వివరించారు. లాక్‌డౌన్‌ను వందశాతం అమలు చేస్తున్నామన్నారు. ఆ మేరకు ని రంతరం పరిశీలిస్తున్నామన్నారు. విదేశాల నుంచి జిల్లాకు 610 మంది వచ్చారనీ, వారందరి వివరాలు సేకరించామన్నారు. అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి, ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా హో మ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించామన్నారు.
జిల్లాలోని గ్రామ, వార్డు వలంటీర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి గ్రామం, వార్డుల్లోనూ ప్రజలందరికీ కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించామన్నారు. విదేశీయుల వివరాలను సేకరించామన్నారు. గ్రామం, వా ర్డుల్లో ప్రతి ఇంటికీ తిరిగి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అని పరిశీలించాలని ఆదేశించామన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యకళాశాలలో కరోనా వైరస్ శాంపిళ్లు పరీక్షించేందుకు టెస్టింగ్ ల్యాబ్‌ను పరిశీలించామన్నారు. రోజూ 30 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉందన్నారు. అంతకు ముందు సీఎస్ మాట్లాడుతూ జిల్లాలో పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. డీ జీపీ సవాంగ్ మాట్లాడుతూ ఉగాది పండుగను ఇళ్లలో జరుపుకోవాలన్నారు. ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రాకూడదన్నారు. ఆ మేర కు చర్యలు తీసుకోవాలని ఎస్పీకు సూచించారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలు కఠినంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో గాయత్రిదేవి, డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్‌తో పా టు వివిధ శాఖల ఉన్నతాదికారులు పాల్గొన్నారు.