వామ్మో! మళ్లీ ఒక్క రోజే 90 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-06-25T10:31:43+05:30 IST
జిల్లాలో కరోనా కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. జనం భయంతో అల్లాడిపోతున్నారు.

అనంతలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వైరస్
జిల్లాలో 1028కు చేరిన బాధితులు
అనంతపురం వైద్యం, జూన్ 24 : జిల్లాలో కరోనా కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. జనం భయంతో అల్లాడిపోతున్నారు. బుధవారం ఒక్కరోజే జిల్లాలో 90 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ లెక్కన జిల్లాలో ఇప్పటి వరకూ 1028 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 347 మంది కోలుకుని ఆస్ప త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏడుగురు మరణించారు. మిగిలినవారు కొవిడ్-19 ఆస్పత్రులలో చికిత్స పొందు తున్నారు. జిల్లా కేంద్రంలో కరోనా బాధితులు అంతకంత కూ పెరిగిపోతున్నారు. అధికార వర్గాల సమాచారం మేరకు అనంతపురంలో 300కు పైగా కరోనా కేసులు న మోదయ్యాయి.
నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న పలు కాలనీల్లోనూ కరోనా తన పంజా విసురుతోంది. ఏ ప్రాం తంలో చూసినా కరోనా బాధితులు ఉన్న ఇళ్లను తడకల తో కప్పి ఉన్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆయా ప్రదేశా లలో రాకపోకలు చేయా లంటేనే జనం జడుసుకుంటున్నారు. అయితే ఆయా కంటైన్మెంట్ ప్రాంతాల్లో భద్రతా చర్యలు లేకపోవడంతో కొందరు అదే ప్రాంతంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కొత్త కొత్త ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురిచేస్తు న్నాయి.
కొవిడ్-19 చికిత్స కేంద్రాలు కిటకిట
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న కేంద్రాలు కిటకి టలాడిపోతున్నాయి. ఎస్కేయూ, బత్తలపల్లి, జిల్లా సర్వజ నాస్పత్రి, హిందూపురం ఆస్పత్రులలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులకు చికిత్సలు అందిస్తున్నారు. జిల్లా వ్యా ప్తంగా ప్రస్తుతం 674 మంది చికిత్స పొందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆయా ఆస్పత్రులలో అవస రం మేరకు వసతులు లేకపోవడంతో కరోనా బాధితులకు పూర్తి స్థాయిలో వైద్యచికిత్సలు అందించలేకపోతున్నట్లు వి మర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా సర్వజనాస్పత్రిలో అయితే చికిత్సలు, వసతులు మరీ అధ్వానంగా ఉన్నాయని బాధి తులు ఆవేదన చెందుతున్నారు. చాలా మంది బాధితు లు జిల్లా ఆస్పత్రి నుంచి తమను బత్తలపల్లి, సవీరా ఆ స్పత్రులకు తరలించాలని వైద్యులను వేడుకుంటున్నారు.
నాగులగుడ్డంలో ఆరు...
మండలంలోని నాగులగుడ్డం గ్రామంలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారి అన్వర్‌బాషా తెలిపారు. గ్రామంలో వారం రోజుల కిందట 40 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 90 సంవ త్సరాల వృద్ధురాలికి పాజిటివ్ వచ్చిందన్నారు. పదేళ్ల పిల్లలు ఇద్దరికి, 20ఏళ్ల వారికి ముగ్గురికి కరోనా సోకింద న్నారు. దీంతో మండలంలో కరోనా బాధితుల సంఖ్య 8కి చేరింది.
రోటరీపురంలో మహిళకు
బుక్కరాయసముద్రం : మండలంలోని రోటరీపురం గ్రామంలో మరో మహిళకు కరోనా సోకింది. పది రోజుల కిందట ఓ మహిళకు కరోనా పాజిటివ్ రాగా ప్రస్తుతం ఆమె సమీప బంధువు కూడా పాజిటివ్ వచ్చినట్టు కొర్రపాడు వైద్యాధికారి హర్ష తెలిపారు.
ఉరవకొండలో బాలుడికి లక్షణాలు..
పట్టణానికి చెందిన 12 ఏళ్ల బాలుడికి బుధవారం కరోనా అనుమానిత లక్షణాలు బయటపడ్డా యి. మూడు రోజుల కిందట ఆ బాలుడు అనంతపురం నుంచి ఉరవకొండకు వచ్చినట్లు తెలుస్తోంది.
గంజికుంటలో ..
మండలంలోని గంజికుంట గ్రామంలో 30 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారిణి జ్యోతిర్మయి బుధవారం తెలిపారు. బాధి తుడిని అనంతపురంలోని ఐసొలేషన్ వార్డుకు తరలించిన ట్లు తెలిపారు.
ధర్మవరంలో మరో 14 ...
పట్టణంలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమెదైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో పట్టణంలో మొత్తం బాధితుల సంఖ్య 73కు పెరిగినట్టు వైద్యులు తెలిపారు. బుధవారం సిద్దయ్యగుట్టలో 8, బ్రా హ్మణ వీధిలో 1, బలిజి కల్యాణమంటపం(మాధవనగర్) వద్ద 1, గాంధీనగర్‌లో 1, చక్రవర్తి థియేటర్ వద్ద 1, నేసే పేటలో 1, పెద్దబజారులోని బురుజు వద్ద 1 మొత్తం 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మడకశిరలో...
పట్టణంలో మరో ఇద్ద రికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. మడకశిర క్వారంటైన్‌లో ఉన్న ఓ యువకుడికి, మహిళకు పరీక్షలు నిర్వహించగా పాజిటి్ నిర్ధారణ కావడంతో ఇద్దరిని బత్తలపల్లి ఆసుపత్రికి తరలించినట్లు అధికారుల ద్వారా తెలిసింది.
దుర్గంలో మరొకరికి
రాయదుర్గంటౌన్: పట్టణంలో బుధవారం మరొక కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు కొవిడ్ వైద్యులు రంగ స్వామి తెలిపారు. నేసేపేటకు చెందిన ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలిపారు. జూన్ 2వ తేదీ భార్య భర్త లు కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఓ వివాహానికి హా జరై 5వ తేదీ తిరిగివచ్చారు. దీంతో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలిపారు.
హిందూపురంలో 5 కేసులు
పట్టణంలో వైరస్ విలయం కొనసాగుతోంది. బుధవారం ఐదు కేసులు నమోదయ్యా యి. ఈ ఐదు కేసులు ప్రైమరీ కాంటాక్ట్ అని అధికారులు తెలిపారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వైద్యురాలి అత్తమా మలకు, రహమత్‌పురం, కంసలపేటలో ముగ్గురికి వైరస్ సోకింది.
కదిరి ప్రాంతంలో ఐదుగురికి...
పట్టణంలోని ఖాజానగర్‌లో ముగ్గురికి, గాండ్ల పెంట మండలంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడినట్లు తహసీల్దార్ మారుతీ బుధవారం తెలి పారు ఆయన మాట్లాడుతూ పట్టణంలో పూర్తి లాక్‌డౌన్ విధించినప్పటికీ ఇంకా కొంత మంది షాపులు తెరుస్తు న్నారని, వారి పైన కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు.