జిల్లాలో మరో రెండు కరోనా

ABN , First Publish Date - 2020-03-30T10:47:01+05:30 IST

జిల్లాలో మరో రెండు కరోనా వైరస్‌ శాంపిల్స్‌ కలెక్షన్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు.

జిల్లాలో మరో రెండు కరోనా

శాంపిల్స్‌ కలెక్షన్‌ కేంద్రాలు

కలెక్టర్‌ గంధం చంద్రుడు


అనంతపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో రెండు కరోనా వైరస్‌ శాంపిల్స్‌ కలెక్షన్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, ఆర్‌డీటీ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ మాంచోఫెర్రర్‌తో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలలో ఒక కేంద్రం కొనసాగు తోందన్నారు. అదనంగా హిందూపురం, బత్తలపల్లి ఆర్‌డీటీ ఆస్పత్రిలో ఒక్కొక్కటి చొప్పున రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీటి ఏర్పాటుతో త్వరతగతిన శాంపిల్స్‌ పరీంక్షించేందుకు అవకాశముంటుందన్నారు.


అలాగే లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లా వ్యా ప్తంగా పేదలు, వలసకూలీలకు భోజన వసతి కల్పించేందుకు పలు ప్రాంతాలను గుర్తించాలన్నారు. రెండు రోజుల్లో భోజన పంపిణీ ఏర్పాట్లు చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒక్కో భోజన పంపిణీ కేంద్రం వద్ద ఒక సూ పర్‌వైజర్‌ను నియమించి అందరికీ భోజనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భోజన పంపిణీకి సంబంధించి వాహనాల సౌకర్యం ఏర్పాటుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఢిల్లీరావు, జేసీ-2 రామ్మూర్తి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి, డీఆర్వో గాయత్రీదేవి, డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రామస్వామినాయక్‌, మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ నీరజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-30T10:47:01+05:30 IST