చెట్ల నరికివేతపై కేసు
ABN , First Publish Date - 2020-12-20T06:17:30+05:30 IST
స్థానిక ప్రభుత్వాస్పత్రి ఆవరణలో పచ్చని చెట్ల నరికివేతపై అటవీశాఖ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు.

కంబదూరు, డిసెంబరు 19: స్థానిక ప్రభుత్వాస్పత్రి ఆవరణలో పచ్చని చెట్ల నరికివేతపై అటవీశాఖ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు భవనాన్ని నిర్మిస్తుండడంతో అక్కడున్న పచ్చని చెట్లను నరికివేశారు. అటవీశాఖ సెక్షన ఆఫీసర్ రామచంద్రానాయక్, బీట్ ఆఫీసర్ రామేశ్వరమ్మ, సిబ్బంది ఈప్రాంతాన్ని పరిశీలించారు. కంబదూరు హసిఫుల్లాఖాన కొట్టేసిన చెట్లను కట్టెల డిపోకు తరలించడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.