నేడు ఉగాది.. ఆలయ దర్శనాలు రద్దు

ABN , First Publish Date - 2020-03-25T11:15:57+05:30 IST

ఉగాది పర్వదినం బుధవారం రోజున జిల్లాలో ఎక్కడా ఆలయ దర్శనాలకు అనుమతి లేదని దేవదాయ ధర్మదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ రామాంజనేయులు మంగళవారం తెలిపారు.

నేడు ఉగాది.. ఆలయ దర్శనాలు రద్దు

భక్తులను అనుమతిస్తే చర్యలు : సహాయ కమిషనర్‌అనంతపురం టౌన్‌, మార్చి 24 : ఉగాది పర్వదినం బుధవారం రోజున జిల్లాలో ఎక్కడా ఆలయ దర్శనాలకు అనుమతి లేదని దేవదాయ ధర్మదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ రామాంజనేయులు మంగళవారం తెలిపారు. కరోనా వైర్‌సను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలయాల్లోకి భక్తుల ప్రవేశాన్ని రద్దు చేసినట్లు చెప్పారు.


ఉగాది పండుగ రోజున కూడా ఆలయాల్లోకి భక్తుల ప్రవేశం ఉండబోదని, కేవలం పురోహితులు మాత్రమే ప్రతిరోజూలాగే పూజాది కైంకర్యాలు నిర్వహించి పం చాంగ పఠనం చేస్తారన్నారు. భక్తులెవరూ ఆలయాలకు వెళ్లకూడదని, ఎవరైనా ఆలయంలోకి భక్తులను అనుమతించినట్లు తెలిస్తే సదరు ఆలయ కార్యనిర్వహణాధికారి, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తులు ఎవరి ఇళ్లల్లో వారు కుటుంబసభ్యుల సమక్షంలో ఉగాది జరుపుకోవాలని కోరారు.

Read more