ఇంటి స్థలం ఆక్రమణకు బెదిరిస్తున్నారు...’
ABN , First Publish Date - 2020-08-22T09:51:44+05:30 IST
మండలంలోని కురుగుంట మల్లయ్య కొట్టాలలో ఉన్న ఇంటి స్థలాన్ని ఆక్రమిం
అనంతపురం రూరల్, ఆగస్టు 21: మండలంలోని కురుగుంట మల్లయ్య కొట్టాలలో ఉన్న ఇంటి స్థలాన్ని ఆక్రమించేందుకు పలువురు బెదిరిస్తున్నట్లు బా ధితులు లక్ష్మి, మురళీకృష్ణ దంపతులు ఆరోపించారు. శుక్రవారం కాలనీలో వా రు మాట్లాడారు. 2018లో రెవెన్యూ అధికారులు ఇంటి పట్టా ఇచ్చారన్నారు. ఆర్థి క స్థోమత లేనికారణంగా ఇల్లు నిర్మించుకోవటంలో జాప్యమవుతోందన్నారు. ఎస్కేయూ ఉద్యోగి చెన్నప్ప తమ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారన్నారు.
అధికార పార్టీకి చెందిన ఆటోనాయక్, కొంతమంది వలంటీర్లతో కలసి దాడికి దిగారన్నారు. అదే కాలనీకి చెందిన సువర్ణమ్మ, సోమశేఖర్ దంపతులు నివాసముంటున్న షెడ్డును ఖాళీ చేయాలని బెదిరించినట్లు బాధితులు వాపోయారు. అధికారులే తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.