దాగుడుమూతలకు తెర
ABN , First Publish Date - 2020-04-01T09:50:38+05:30 IST
కరోనా కేసుల విషయంలో జిల్లా అధికార యం త్రాంగం ఆడుతున్న దాగుడుమూతలకు తెరపడింది.

జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు
ప్రకటించిన అధికారులు
మిగతా అనుమానితుల
రిపోర్టులపైనా ఆందోళన
జిల్లా ఆస్పత్రి ఐసొలేషన్‌కు
మరో ఏడుగురి తరలింపు
ఓపీ విభాగాలు తనిఖీ చేసిన
ప్రత్యేక అధికారి బాబురావునాయుడు
వసతులు, బాధితుల
ఆరోగ్యంపై ఆరా.. సీరియ్‌సగా ఆదేశాలు
అనంతపురం వైద్యం, మార్చి 31: కరోనా కేసుల విషయంలో జిల్లా అధికార యం త్రాంగం ఆడుతున్న దాగుడుమూతలకు తెరపడింది. ‘దాగుడుమూతలెందుకో..?’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యశాఖతో పాటు జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ జిల్లాలో కరోనా కేసుల వివ రాలు బయటపెట్టారు. జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారికంగా వారు తెలియజేశారు. ఇందులో హిందూపురంలో ఒకటి, లేపాక్షిలో మరొకటి గుర్తించినట్లు ప్రకటించా రు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా హైటెన్షన్ మొ దలైంది. ఇప్పటికే పుట్టపర్తి, అనంతపురంలో పర్యటించిన ఫ్రాన్స్ దేశీయుడికి బెంగళూరులో కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు బెంగళూరులో నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందనవసంరం లేదని అధికారులు సూచిస్తూ వచ్చారు. తాజాగా జిల్లాలోనే రెండు కేసులు నిర్ధారణ కా వడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంకా ఎన్ని పాజిటివ్ కేసులు న్నాయోనని తీవ్ర ఆందోళనలో వారు పడిపోయారు.
మిగతా అనుమానితుల రిపోర్టులపైనా ఆందోళన
కరోనా అనుమానితులను ఐసొలేషన్‌కు, క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. వారి శాంపిల్స్ తీసి వ్యాధి నిర్ధారణ కోసం పంపిస్తున్నారు. ఇప్పటివరకూ అధికారిక లెక్కల ప్రకారం పరీక్షల కోసం 68 శాంపిల్స్ పంపించారు. ఇందులో 55 మం దికి సంబంధించిన ఫలితాలు రాగా.. వారిలో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. మిగిలిన వారికి నెగిటివ్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 13 మంది అనుమానితుల రిపోర్టులు అందా ల్సి ఉంది. ఇందులో పాజిటివ్ కేసులేమైనా ఉన్నాయా? అనే విషయమై జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
అనంత ఆస్పత్రి ఐసొలేషన్‌కు ఏడుగురి తరలింపు..
జిల్లా ఆస్పత్రిలోని ఐసొలేషన్‌కు ఏడుగురు కరోనా అనుమానితులను తరలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మంగళవారం కూడా సుమారు 20 మందికిపైగా అనుమానితులు పరీక్షల కోసం వచ్చారు. కరోనా ప్రత్యేక ఓపీ విభాగంలో వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో వైద్యులు కూడా అనుమానంతో ఏడుగురిని ఐసొలేషన్‌కు తరలించి చికిత్సలందిస్తున్నారు. కాగా, జిల్లా ఆస్పత్రి ఐసొలేషన్‌లో మొత్తం 25 మంది వరకు చికిత్సలు పొందుతున్నారు.
ఐసొలేషన్‌ను పరిశీలించిన బాబురావునాయుడు..
జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసొలేషన్ విభాగాన్ని జిల్లా ప్రత్యేకాధికారి బాబురావునాయుడు(ఐఏఎ్‌స)మంగళవా రం తనిఖీ చేశారు. ‘ఐసొలేషన్ హౌస్‌ఫుల్’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఉదయమే జిల్లా ఆస్పత్రికి ఆయన చేరుకుని ఐసొలేషన్ విభాగాలను పరిశీలించారు. అక్కడి గదులు, వసతులు, వైద్యసేవలు, ప్రస్తు తమున్న బాధితులు తదితర వివరాలు సూపరింటెండెంట్ రామస్వామి నాయక్, ఆర్‌ఎంఓ లలిత, డిప్యూటీ ఆర్‌ఎంఓలు విజయమ్మ, వైవీరావు, మేనేజర్ శ్వేత తదితరులనడిగి తెలుసుకున్నారు.
అలాగే కరోనా అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓపీ విభాగాన్ని కూ డా పరిశీలించారు. రోజుకు ఎంతమంది వస్తున్నారు..? వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు? అని అడిగి తెలుసుకున్నా రు. రికార్డులు కూడా పరిశీలించారు. అనంతరం ప్రతిఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. ఐసొలేషన్‌లో కరోనా బాధితులకు అవసరమైన వసతు లు, వైద్యసేవలు అందేలా చూడాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో వైద్యు లు, సిబ్బంది ఎక్కడా అలసత్వం ప్రదర్శించరాదన్నారు. అదే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.