మళ్లీ అదే తప్పు

ABN , First Publish Date - 2020-04-25T10:08:13+05:30 IST

ఒక సా రి కింద పడగానే చిన్నపిల్లలు సైతం రెండోసారికి జాగ్రత్త పడతారు

మళ్లీ అదే తప్పు

 అడిగేవారే లేరనా ?

 పాఠం నేర్వని వైద్యాధికారులు

 చికిత్స కొచ్చి హిందూపురం మహిళ మృతి

 శాంపిల్‌ తీశారు..ఫలితం రాకనే శవం అప్పగించారు

 మూడ్రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

 గతంలోనూ ఇద్దరు కరోనా మృతులపై ఇదే తంతు

 జిల్లా సర్వజనాస్పత్రి వైద్యాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు


అనంతపురం,ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) :  ఒక సా రి కింద పడగానే చిన్నపిల్లలు సైతం రెండోసారికి జాగ్రత్త పడతారు. అలాంటిది అమోఘమైన వైద్య విద్యనభ్యసించి, ఏళ్లుగా వైద్య సేవలు చేస్తున్న వైద్యులు మాత్రం నిర్లక్ష్యం గా పదే పదే అదే తప్పును చేస్తున్నారు. జిల్లాలో వైద్యులు, నర్సులకు కరోనా సోకడానికి కారణమైన తప్పును మళ్లీ మళ్లీ చేస్తున్నారు. చేసిన తప్పును ప్రశ్నించేవారు లేరనా లేక ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యమా ? అనే ప్రశ్నలు జని స్తున్నాయి. వీరు చేస్తున్న పొరపాట్లు జిల్లా ప్రజలకు శా పంగా మారుతున్నాయి. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్వని వైద్యులు, అధికారుల తీరుపై తీవ్రంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


ఇందుకు తాజాగా జరిగిన మరో కరోనా కేసు ఉందం తమే మంచి ఉదాహరణ. హిందూపురానికి చెందిన 24 సంవత్సరాల మహిళకు కరోనా పాజిటివ్‌గా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఈ నెల 21వ తేదీ ఉదయం 8 గంటల్లోపు ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే మరణిం చింది. ఆ మహిళకు కరోనా వ్యాధి నిర్ధారణకు బ్లడ్‌ శాంపి ల్‌ తీశారు. కానీ రిపోర్టు రాకముందే నిర్లక్ష్యంగా ఆమె శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి పంపించేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆ మహిళకు అంత్యక్రియలు నిర్వహించారు. మూడ్రోజుల తర్వాత  చనిపోయిన ఆ హిందూపురం మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వెల్లడించారు. దీంతో ఆ కుటుంబంతో పాటు ఆ మహిళకు వైద్య సేవలు అందించిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బం దిలో టెన్షన్‌ మొదలైంది. గతంలోనూ ఇలాగే ఇద్దరు కరోనా మృతులపైనా ఈ సర్వజనాస్పత్రిలో ఇలాగే అలస త్వం ప్రదర్శించారు.


హిందూపురానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు జిల్లా ఆస్పత్రిలో చేరి చనిపోయాడు. అప్పటికే కరోనా నిర్ధారణకు శాంపిల్‌ తీశారు. ఆ రిపోర్టు రాకనే ఆ వృద్ధుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించి చే తులు దులుపుకున్నారు. అప్పుడు కూడా చనిపోయిన రెండ్రోజుల తర్వాత ఆ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ అని వె ల్లడించారు. ఆ వృద్ధుడి కుటుంబసభ్యులతో పాటు జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న నలుగురు వైద్యులు, ముగ్గురు నర్సులు కరోనా బారిన పడ్డారు. మరెందరో వైద్యులు భయపడి హోం క్వారంటైన్‌లో  ఉండిపోయారు. అప్పట్లో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపించాయి. అయి నా వారిలో మార్పు కనిపించలేదు. అది మరువకముందే కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామానికి చెందిన 64 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతూ వచ్చాడు. పరిస్థితి విషమించడంతో చనిపో యిన హిందూపురం వృద్ధుడు చికిత్స పొందిన ఐసీయూ విభాగానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ  మరణించాడు.


అప్పుడు కూడా కరోనా నిర్ధారణకు శాంపి ల్‌ తీసి రిపోర్టు రాకనే శవాన్ని కుటుంబసభ్యులకు అప్ప గించి పంపించేశారు. ఆ వృద్ధుడు కుటుంబసభ్యులు, బంధువులు పాల్గొని మానిరేవు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత ఆ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ వ చ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో  ఆ వృద్ధుడి కు టుంబసభ్యులు, అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువులను గుర్తించి క్వారంటైన్‌లకు తరలించారు. ఆ వృద్ధుడి భార్య, కుమార్తెకు ఇప్పటికే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు దా దాపు 50 మంది దాకా క్వారంటైన్‌లలో ఉన్నారు. ఇలా అధికారుల పాపానికి ఎందరో నరకం అనుభవిస్తున్నారు. అయినా మళ్లీ జిల్లా ఆస్పత్రి వైద్యాధికారులు కరోనా మృత దేహంపై ఇంత నిర్లక్ష్యం వహించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.  

Updated Date - 2020-04-25T10:08:13+05:30 IST