-
-
Home » Andhra Pradesh » Ananthapuram » The person committed suicide
-
వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-15T06:35:10+05:30 IST
కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన మహేష్ (36) సోమవారం ఉరివే సుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

్జకదిరిఅర్బన్, డిసెంబరు 14 : కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన మహేష్ (36) సోమవారం ఉరివే సుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు మహేష్ పట్నం గ్రామంలో సెలూన్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. తరచూ భార్య భర్తలు గొడవ పడేవారు. భార్య నెల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురై మహేష్ ఇంట్లో సోమవారం ఉరివేసుకుని మృతి చెందాడు. పట్నం ఎస్‌ఐ నగేష్‌బాబు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.