భౌతికదూరం.. బహుదూరం..

ABN , First Publish Date - 2020-04-07T09:44:54+05:30 IST

నిర్లక్ష్యం.. ఎటుచూసినా నిర్లక్ష్యం.. ఎక్కడ చూసినా నిర్లక్ష్యం.. కరోనా వైర స్‌ విపరీత వేగంతో వ్యాప్తి చెందుతోంది.

భౌతికదూరం.. బహుదూరం..

సేవా కార్యక్రమాలు చేపట్టే చోట,

బ్యాంకుల వద్ద గుంపులుగుంపులుగా జనం..

నిర్లక్ష్యం వీడకపోతే తప్పదు ప్రమాదం..


అనంతపురం, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): నిర్లక్ష్యం.. ఎటుచూసినా నిర్లక్ష్యం.. ఎక్కడ చూసినా నిర్లక్ష్యం.. కరోనా వైర స్‌ విపరీత వేగంతో వ్యాప్తి చెందుతోంది. దీనిని జయించాలంటే జాగ్రత్తలే మార్గమనీ, భౌతికదూరం తప్పక పాటించాలని పాలకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు రోజూ చెబుతూనే ఉన్నారు. అయినా భౌతికదూరం బహుదూరమే అవుతోంది. పాటించమని చెప్పాల్సిన ప్రజాప్రతినిధులే ఉల్లంఘిస్తున్నారు. కరోనా వైర్‌సతో ఉపాధి కోల్పోయి తిండికి కూడా లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, నిరాశ్రయులను ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకొస్తున్నారు. హర్షణీయం. అభినందనీయం. సేవ చేసే సమయంలో అస్స లు.. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందన్న వాస్తవాన్ని వారు మ రచిపోతున్నారు.


భౌతికదూరం పాటించకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందన్న ప్రమాదాన్ని గ్రహించలేకపోతున్నా రు. చివరికి బ్యాంకుల దగ్గర కూడా ఇదే దుస్థితి. భౌతికదూరం పాటించటం సంగతి పక్కనపెడితే జనం తోసుకుంటున్నారు. ఇలా ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే. ప్రమాదఘంటికలు మోగుతున్నా వీడట్లేదు. ఇప్పటికైనా మారాలి. సేవా కార్యక్రమాలు చేపట్టే చోట, బ్యాంకుల వద్ద తప్పక భౌతికదూరం పాటించాలి. అప్పుడే మహమ్మారిని తుద ముట్టించగలం. లేదంటే ప్రాణాలనే మూల్యంగా చెల్లించా ల్సి వస్తుంది.

Read more