రెండు అప్పీళ్లకు కలెక్టర్‌ ఆమోదం ఒకటి తిరస్కరణ

ABN , First Publish Date - 2020-03-15T12:07:06+05:30 IST

తిరస్కరణకు గురైన ఇద్దరు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల అప్పీళ్లకు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆమోదం తెలిపినట్లు జడ్పీ సీఈఓ

రెండు అప్పీళ్లకు కలెక్టర్‌ ఆమోదం  ఒకటి తిరస్కరణ

అనంతపురం విద్య, మార్చి 14: తిరస్కరణకు గురైన ఇద్దరు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల అప్పీళ్లకు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆమోదం తెలిపినట్లు జడ్పీ సీఈఓ శోభాస్వరూపారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిగి మండలం రంగరాజుపల్లికి చెందిన లక్ష్మీదేవమ్మ (టీడీపీ అభ్యర్థి), రొళ్ల మండలానికి చెందిన గౌడప్ప(కాంగెస్‌ అభ్యర్థి) వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా సంబంధిత అభ్యర్థులు శనివారం కలెక్టర్‌కు ఆప్పీల్‌ చేశారన్నారు. దీంతో కలెక్టర్‌ వాటిని పరిశీలించి సానుకూలంగా ఆమోదం తెలిపారన్నారు. అలాగే తనకల్లు మండలానికి చెందిన ఈశ్వరమ్మ(బీఎస్పీ అభ్యర్థి) అప్పీల్‌కు అనుమతి ఇవ్వడానికి కలెక్టర్‌ నిరాకరించినట్లు ఆమె తెలిపారు.

Updated Date - 2020-03-15T12:07:06+05:30 IST