బీపీఎస్‌ పరిశీలన గడువు రెండు నెలలు పొడిగింపు

ABN , First Publish Date - 2020-03-04T07:02:16+05:30 IST

భవన క్రమబద్ధీకరణ విధానం (బీపీఎస్‌) కింద దాఖలైన దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం మరో రెండు నెలలు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బీపీఎస్‌ పరిశీలన గడువు రెండు నెలలు పొడిగింపు

జిల్లాలో 392 దరఖాస్తులు పెండింగ్‌ 


అనంతపురం కార్పొరేషన్‌, మార్చి 3 : భవన క్రమబద్ధీకరణ విధానం (బీపీఎస్‌) కింద దాఖలైన దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం మరో రెండు నెలలు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత అక్రమ కట్టడాలను సక్రమంగా క్రమబద్ధీకరించేందుకు గత ఏడాది జనవరిలో దరఖాస్తులు కోరుతూ ఏప్రిల్‌ వరకు గడువు విఽధించారు. ఆ తరువాత మరో రెండుసార్లు గడువు పొడిగించారు. చివరికి ఆగస్టు నెలాఖరువరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చారు. వాటిని క్రమబద్ధీకరించే విషయంలో చాలా ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఇందుకు అధికారులు సాంకేతిక సమస్యలు, ఓటరు జాబితా సాకులు చెబుతూ వచ్చారు. జిల్లాలో అనంతపురం నగరపాలక సంస్థతో పాటు 12 మున్సిపాలిటీలకు గాను మొత్తం 2258 దరఖాస్తులు అందాయి. వాటిలో ప్రస్తుతం అనంతపురం 270, ధర్మవరం 18, గుంతకల్లు 65, హిందూపురం 6, కదిరి 15, రాయదుర్గం 3, తాడిపత్రి 10, మడకశిర 2, గుత్తి, పామిడి, పుడాలో ఒక్కో దరఖాస్తు మేరకు మొత్తం 392 పెండింగ్‌లో ఉన్నాయి. ఏప్రిల్‌ 30లోపు ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

Updated Date - 2020-03-04T07:02:16+05:30 IST