-
-
Home » Andhra Pradesh » Ananthapuram » The boy fell into a pool of water and died
-
నీటి మడుగులో పడి బాలుడి మృతి
ABN , First Publish Date - 2020-12-30T06:33:27+05:30 IST
మండలంలోని మల్లాపురం తండా గ్రామ శివార్లలోని నీటి మడుగులో పడి బాలుడు రుతిక్ నాయక్ (2) మంగళవారం మృతి చెందాడు.

రాయదుర్గం రూరల్, డిసెంబరు 29 : మండలంలోని మల్లాపురం తండా గ్రామ శివార్లలోని నీటి మడుగులో పడి బాలుడు రుతిక్ నాయక్ (2) మంగళవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. అనితాబాయి, శీనానాయక్ దంపతులకు ఒక్కగానొక్క కు మారుడు రుతిక్ నాయక్. రోజులాగానే తల్లిదండ్రులు పొలం పనుల వద్దకు చిన్నారిని తీసుకుపోయారు. వారు పనులు ఉండగా, ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి మడుగులో పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత బాలుడు కనిపించకపోవడంతో వెతకగా. నీటి మడుగులో శవమై తేలాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోధ నలు మిన్నంటాయి.