నేటి నుంచి దూరదర్శన్‌లో ‘పది’ తరగతులు

ABN , First Publish Date - 2020-04-08T09:46:25+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి దూరదర్శన్‌ సప్తగిరి చానల్‌లో తరగతులు

నేటి నుంచి దూరదర్శన్‌లో ‘పది’ తరగతులు

అనంతపురంరూరల్‌, ఏప్రిల్‌7: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి దూరదర్శన్‌ సప్తగిరి చానల్‌లో తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కో-ఆర్డినేటర్‌ ఉషారాణి తెలిపారు. రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు తరగతులుంటాయన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - 2020-04-08T09:46:25+05:30 IST